Monday, September 30, 2024
HomeUncategorizedకర్ణాటకలో 223 తాలూకాల్లో కరువు తాండవిస్తోంది

కర్ణాటకలో 223 తాలూకాల్లో కరువు తాండవిస్తోంది

Date:

కర్ణాటక రాష్ట్రంపై కేంద్రం వైఖరిపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతల బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. సీఎం సిద్ధ రామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ తరఫున కేంద్రానికి నిరసన తెలిపామన్నారు. నరేంద్ర మోడీ, అమిత్‌ షా, కర్ణాటక రైతులను ద్వేషిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 22న కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చామని.. ఆ తర్వాత కేంద్ర బృందం వచ్చి రాష్ట్రానికి వచ్చి పరిశీలించి వెళ్లిందన్నారు. రాష్ట్రంలో 223 తాలూకాల్లో కరువు తాండవిస్తోందన్నారు.

అమిత్‌షా చెన్నపట్నం వచ్చి ప్రభుత్వం ఆలస్యంగా మెమోరాండం ఇచ్చిందని చెప్పారని మండిపడ్డారు. కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటి వరకు రైతులకు రూ.650 కోట్లు పంపిణీ చేశామన్నారు. నిర్మలా సీతారామన్‌, నరేంద్ర మోదీ కారణంగా కర్ణాటకకు ఊరట లభించలేదు. కర్ణాటకకు తీరని అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా అన్నారు. మోదీ ప్రభుత్వం కర్ణాటక రైతులు, ప్రజల నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని విమర్శించారు. ఇవాళ బీజేపీ ప్రతీకార రాజకీయాలు తెరపైకి వస్తున్నాయన్నారు. రూ.18,172 కోట్లు ఇవ్వకుండా కర్ణాటక గడ్డపై అడుగుపెట్టే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు.