Monday, September 30, 2024
Homeక్రైంకేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలని న్యాయ విద్యార్థి పిటిషన్‌

కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలని న్యాయ విద్యార్థి పిటిషన్‌

Date:

కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని అసాధారణ మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని న్యాయ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. మధ్యంతర బెయిల్‌ను కోరిన పిటిషనర్‌కు రూ.75వేల జరిమానా విధిందించింది. న్యాయ విద్యార్థి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ కోసం.. ‘వి ది పీపుల్ ఆఫ్ ఇండియా’ పేర్కొన్న నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థి పిల్‌ దాఖలు చేశాడు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీతో ఈడీ మనీలాండరింగ్‌ కేసుతో సహా అన్నింట్లో అసాధారణ మధ్యంతర బెయిల్‌ ఇస్తూ విడుదల చేయాలని కోరారు.

కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి స్వయంగా వ్యతిరేకించారు. దీన్ని ‘ఆకస్మిక దాడి’గా ఆయన అభివర్ణించారు. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌ను ‘పబ్లిసిటీ లిటిగేషన్’.. రాజకీయ ప్రేరేపితమన్నారు. కేవలం పబ్లిసిటీ కోసం చేసిందని, పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్ ఎవరు? కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పిటిషనర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావని తీవ్రంగా స్పందించింది. పిటిషన్‌ను తిరస్కరిస్తూ రూ.75వేల జరిమానా విధించింది.