Sunday, September 29, 2024
HomeUncategorizedజగన్‍పై రాయిదాడి కేసులో పురోగతి

జగన్‍పై రాయిదాడి కేసులో పురోగతి

Date:

సీఎం జగన్‍పై రాయిదాడి కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు పోలీసులు. సతీష్ అనే యువకుడు జగన్‍పై రాయి విసిరినట్లు గుర్తించారు. సతీష్ అజిత్‍సింగ్ నగర్ వడ్డెరకాలనీకి చెందిన యువకుడి అని తేల్చారు. సతీష్‍తో పాటు అతనితో ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‍లను అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు . ఫుట్‍పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు గుర్తించారు. రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. అకస్మాత్తుగా జగన్‍పై సతీష్ డాడి చేశాడని పోలీసులు అంటున్నారు.

గతంలో అతనిపై ఏమైనా కేసులు ఉన్నాయా.. అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఏ పార్టీకి చెందిన వాడు .? నవరత్నాలు + వైసిపి పథకాలలో ఇతను లబ్ధిదారుడా కాదా అని చెక్ చేస్తున్నారు. జగన్ పై దాడి వెనుక ఉన్న అంతర్యం ఏమిటి..? అతనిని ప్రేరేపించడానికి వెనుక ఎవరున్నారా అన్న వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. నిందితుడు సతీష్ కుమార్ బ్యాంక్ అకౌంట్స్ , ఫోన్ కాల్ డేటా.. కూడా సేకరిస్తున్నారు. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తుండగా.. జగన్ పై శనివారం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బస్సుయాత్రలో వస్తున్న జగన్‌ని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు. ఈ రద్దీలో గుర్తు తెలియని ఆగంతకులు జగన్ వాహనం వైపు రాళ్లు విసిరారు. అయితే ఆ రాయి కాస్త జగన్ నదుటిపైన ఎడమ కంటికి తగిలి గాయమైంది. ఆయనకు రక్తస్త్రావం కావడంతో వెంటనే వైద్యులు అప్రమత్తమై ప్రాథమిక చికిత్స చేశారు. దాడి జరిగిన సమయంలో బస్సుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనకు కూడా గాయమైంది