Saturday, September 28, 2024
HomeUncategorizedకొనసాగుతున్న ఐస్‌ బాత్ ట్రెండ్‌ హవా

కొనసాగుతున్న ఐస్‌ బాత్ ట్రెండ్‌ హవా

Date:

రోజులు మారుతున్న కొద్ది కొత్త, కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఐస్‌ బాత్ ట్రెండ్‌ నడుస్తోంది. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు ఐస్‌ బాత్‌ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఇంతకీ ఐస్‌ బాత్‌ అంటే ఏంటి.? అసలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న సహజంగానే తలెత్తులతుంది. మరి ఇంతకీ ఐస్‌ బాత్‌ ఏంటి.? అసలు ఎందుకు చేస్తున్నారు.? దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐస్‌ బాత్ ట్రెండ్‌ ఉపయోగాలు

  • ఐస్‌ బాత్ చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల కలిగే వాపు సమస్యలు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. అలాగే గాయాల కారణాల వల్ల వచ్చే వాపును సైతం ఈ విధానం ద్వారా తగ్గించుకోవచ్చు.
  • అలసటతో ఇబ్బంది పడే వారికి కూడా ఐస్‌ బాత్‌ ఉపయోగపడుతుంది. చల్లటి నీరు నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఐస్‌ బాత్ చేయడం వల్ల శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది.
  • చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాల పునరుద్ధరణ వేగవంతం అవుతుంది. వ్యాయామం తర్వాత కండరాలలో మైక్రో-టియర్స్ ఏర్పడతాయి. ఐస్ బాత్‌ చేయడం వల్ల కండరాల సమస్యలు తగ్గుతాయి.
  • అయితే ఐస్‌ బాత్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సూచనలు తీసుకున్న తర్వాతే ఇలాంటిది ట్రై చేయాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఐస్‌ బాత్‌ చేయకపోవడమే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
  • ముఖ్యంగా హృద్రోగ సమస్యలతో బాధపడే వారు కూడా ఐస్‌ బాత్‌కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణపై ప్రభావం చూపడం కారణంగా గుండ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే డెలికేట్ స్కిన్‌ ఉన్న వారు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.