Saturday, September 28, 2024
Homeక్రైంకవిత బెయిల్ రాకుండా అడ్డుకునేది ఆమెనా..?

కవిత బెయిల్ రాకుండా అడ్డుకునేది ఆమెనా..?

Date:

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైనా కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉంది. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్ పై తీర్పు సోమవారం రాబోతోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రధాన సూత్రధారి కవితేనని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. కవితకు సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు ఇస్తున్నారు. కుమారుడి పరీక్షల కోసం కవిత బెయిల్ కావాలని పిటిషన్ వేయగా, ఈడీ అధికారి భానుప్రియ మీనా వాటికి గండికొడుతున్నారు.

బెయిల్ పిటిషన్ పై విచారణ ఆలస్యమవుతుండటంతో మధ్యంతర బెయిల్ కావాలని కవిత కోరుతున్నారు. దీనికి ప్రధాన కారణం కుమారుడికి పరీక్షలు ఉండటమే. అయితే ఈడీ అధికారులు మాత్రం జడ్జి ఎదుట కవితకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసు ప్రణాళిక రచించిందే కవిత అని, ఆధారాలను ధ్వంసం చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదంటూ ఈడీ జేడీ భానుప్రియామీనా తాను కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు.

పరీక్షలు రాస్తున్న కవిత కొడుకు మరీ చిన్నవాడు కాదని, కొన్ని పరీక్షలు ఇప్పటికే ముగిశాయన్నారు. తన కుమారుడికి ఎగ్జామ్‌ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఆధారాలు ఇవ్వలేదన్నారు. కవిత పెద్దకొడుకు స్పెయిన్ లో ఉన్నాడని తెలిపారు. కవిత తన బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలుకానీ, కుటుంబ వ్యాపారాల వివరాలుకానీ ఇవ్వడంలేదనే విషయాన్ని కూడా జడ్జి దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. కవితకు బెయిల్ రాకుండా ఉండేందుకు భానుప్రియామీనా స్వయంగా కోర్టుకు వచ్చి వాదిస్తున్నారు. అంతేకాదు.. ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసే సమయంలో కేటీఆర్ వాదన పెట్టుకున్నది కూడా భానుప్రియామీనాతోనే.