Monday, December 23, 2024
Homeఅంతర్జాతీయంబిలియనీర్ల జాబితాలో 19ఏళ్ల యువతి

బిలియనీర్ల జాబితాలో 19ఏళ్ల యువతి

Date:

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2024 రెండురోజుల క్రితం ప్రకటించింది. బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల ఓ కళాశాల విద్యార్థిని.. వరల్డ్ యంగెస్ట్ బిలియనీర్ టైటిల్ కైవసం చేసుకుంది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో బిలియనీర్‌గా అవతరించింది. ఇప్పటి వరకు యంగెస్ట్ బిలియనీర్‌గా కొనసాగుతున్న ఇటలీకి చెందిన యువకుడు క్లెమెంటే డెల్ వెచియోను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. ఈ ఇరువురి మధ్య వయసు తేడా కేవలం రెండు నెలలే కావడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసు బిలియనీర్‌గా అవతరించింది ఎవరో కాదు. బ్రెజిల్‌కు చెందిన విద్యార్థిని లివియా వోయిగ్ట్.

19 ఏళ్ల లివియా వోయిగ్ట్.. లాటిన్ అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ మోటార్స్ తయారీదారులలో ఒకరికి వారసురాలిగా ఉన్నారు. తన తాత వెర్నెర్ రిచార్డో వోయిగ్ట్ స్థాపించిన ఎలక్ట్రికల్ మోటార్స్ కంపెనీ డబ్ల్యూఈజీలో వివియాకు అతిపెద్ద వాటా ఉంది. దీంతో చిన్న వయసులోనే లివియా బిలియనీర్‌గా అవతరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తన సంపదతోనే కాదు.. తన చదువుతోనూ అందరి దృష్టని తనవైపునకు తిప్పుకుంటోంది ఈ యువతి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఆమె ఒక యూనివర్సిటీ విద్యార్థిని. ప్రస్తుతం ఆమె సంపద 1.1 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. భారత కరెన్సీలో రూ.9 వేల కోట్లకుపైగా ఉంటుంది. త్వరలోనే ఆమె వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెట్టనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

యంగెస్ట్ బిలియనీర్లలో.. ఇటలీకి చెందిన 19 ఏళ్ల క్లెమెంటే డెల్ వెచియో ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయాడు. దీంతో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2024లో సెకండ్ యంగెస్ట్ బిలియనీర్‌గా నిలిచాడు. అతడి నికర సంపద 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ.40 వేల కోట్లకుపైగా ఉంటుంది. సంపద పరంగా చూసుకుంటే లివియా కన్నా 4 రెట్లు ఎక్కువగా క్లెమెంటే సంపద ఉంది. మరోవైపు.. ప్రపంచంలోనే అతి చిన్న వయసు బిలియనీర్లుగా లివియా వోయిగ్ట్, క్లెమెంటే డెల్ వెచికో ఉండగా.. భారత్ నుంచి యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో జెరోధా ఫౌండర్స నితిన్ కామత్, నిఖిల్ కామత్, సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ నిలిచారు.