Saturday, September 28, 2024
Homeక్రైంఏప్రిల్ పూల్ చేద్దామని ప్రాణాలు కొల్పోయాడు

ఏప్రిల్ పూల్ చేద్దామని ప్రాణాలు కొల్పోయాడు

Date:

ఏప్రిల్ పూల్ రోజు సరదాగా స్నేహితుడిని సరదాగా ఫూల్‌ చేసేందుకు ప్రయత్నించిన ఒక యువకుడు ప్రాణాలు కొల్పోయాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రాంక్‌ చేద్దామనుకుని ఊహించని విధంగా అదే ఉరి కొయ్యకు వేలాడి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఇందౌర్‌కు చెందిన ఓ యువకుడు(18) సోమవారం తన స్నేహితుడిని ఏప్రిల్‌ ఫూల్‌ చేద్దామని భావించాడు.

ఈ క్రమంలోనే తన ఇంట్లో ఉన్న ఉరితాడుని మెడకు బిగించుకుని.. మిత్రుడికి వీడియో కాల్‌ చేసి, ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అంతలోనే అతడు నిల్చొని ఉన్న కుర్చీ ప్రమాదవశాత్తూ పక్కకు పడిపోయింది. దీంతో ఉరి బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.