Saturday, September 28, 2024
HomeUncategorizedప్రపంచంలోనే భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలమైనది

ప్రపంచంలోనే భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలమైనది

Date:

సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ 90వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ఆర్‌బీఐ 80ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో తాను పాల్గొన్నానని.. అప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు. భారతదేశంలోని మొత్తం బ్యాంకింగ్ రంగం సమస్యలు.. సవాళ్లను ఎదుర్కొందన్నారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, భవిష్యత్తుపై సందేహాస్పదంగా ఉందన్నారు.

ప్రధానమంత్రి ప్రకారం.. పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక పురోగతిని తగినంతగా ప్రోత్సహించలేకపోయాయన్నారు. ప్రస్తుతం భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలో బలమైన, స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థగా ఉందన్నారు. తమ ప్రభుత్వం గుర్తింపు, తీర్మానం, రీక్యాపిటలైజేషన్ వ్యూహంపై పని చేసిందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చి, పాలనా సంస్కరణలను చేపట్టిందన్నారు. దాదాపు రూ.3.25 లక్షల కోట్ల విలువైన రుణాలు దివాలా కోడ్ కొత్త వ్యవస్థ ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ ఓ సంస్థగా వృద్ధి చెందడం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధితో దగ్గరి సంబంధం ఉందన్నారు. సెంట్రల్ బ్యాంక్‌గా ఉన్నందున.. ఆర్‌బీఐ మార్కెట్, ఆర్థిక వ్యవస్థకు ఎనేబుల్‌గా చేసిందన్నారు. ఇటీవలి సంవత్సరాలల్లో ఇన్‌సాల్వెన్సీ, దివాలా కోడ్‌ని అమలు చేయడం, సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కోవటానికి, ధరల స్థిరత్వాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడానికి తమకు సహాయపడ్డాయని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. నేటి ప్రపంచంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులను దృష్టిలో ఉంచుకుని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు అవసరమైన పాలసీ చర్యలు తీసుకుంటోందని వివరించారు.