Saturday, September 28, 2024
Homeక్రైంజైల్‌లో కవిత మెడిటేషన్.. జపమాలకు ఓకే

జైల్‌లో కవిత మెడిటేషన్.. జపమాలకు ఓకే

Date:

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా.. జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. పలు విజ్ఞప్తులు చేయగా అందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కవిత తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కవితకు మధ్యంతర బెయిల్‌తో పాటు రెగ్యూలర్ బెయిల్ కూడా ఇవ్వాలని ధర్మాసానాన్ని సింఘ్వి కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాం‌ కేసుకు సంబంధించి ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కవిత పేరు లేకున్నా ఆమెను అరెస్ట్ చేశారని ధర్మాసనానికి మరోసారి గుర్తుచేశారు. మొదటి, సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లోనూ కవిత పేరు లేదని పేర్కొన్నారు. అసలు విచారణకు సహకరిస్తున్నప్పుడు కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సింఘ్వి అడిగారు. విచారణలో భాగంగా.. అరుణ్ పిళ్లై 9 సార్లు ఇచ్చిన వాంగ్మూలంలోనూ కవిత పేరును ప్రస్తావించలేదని గుర్తించారు. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అనంతరం.. ఈడీ వేసిన కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు కోర్టును సింఘ్వి సమయం అడిగారు. ఈ నెల 3వ తేదీన సవివరంగా సమాధానం చెబుతానని తెలిపారు.

మరోవైపు తీహార్‌లో జైల్‌లో ఉన్నన్ని రోజులు కవితకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం మరోసారి అనుమతి ఇచ్చింది. దీంతో పాటు పుస్తకాలు, పెన్నులు, పేపర్లకు కూడా అనుమతించింది. ఇక.. జైల్‌లో మెడిటేషన్ చేసుకునేందుకు గానూ.. జపమాల కావాలని కోరగా అందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు.. స్పోర్ట్స్ షూ కూడా కావాలని కోరగా.. అది కూడా లేస్ లేని షూస్ ఇవ్వాలని కోరగా.. అందుకు కూడా దర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు.. జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.