Wednesday, January 22, 2025
Homeసినిమారెండో పెళ్లి చేసుకున్న నటుడు సిద్ధార్థ్

రెండో పెళ్లి చేసుకున్న నటుడు సిద్ధార్థ్

Date:

తెలుగు, తమిళ స్టార్ సిద్ధార్థ్- హీరోయిన్ అదితి రావు హైదరీలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. తాజాగా ఈ జంట వివాహా బంధంతో ఒకటైయ్యారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ, సిద్ధార్ద్ ప్రేమించుకుంటున్నారనే టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి ముంబైలోని పలు రెస్టారెంట్‌లలో కనిపించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. మహా సముద్రం సినిమా నుంచి ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరేడు నెలల నుంచి సిద్దార్థ్- అదితిరావు హైదరీ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటైయ్యారు.

ఇప్పటికే సిద్ధార్ద్‌కు ఒక పెళ్లీ అయ్యింది. సిద్ధార్థ్ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్నాడు. ఆయన 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇక అదితిరావు హైదరీకి కూడా ఇది రెండో పెళ్లి అని సమాచారం. అదితి రావు గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. 2012లో ఆమె విడాకులు తీసుకుంది. అదితి తెలుగులో వి, సమ్మోహనం, అంతరిక్షం వంటి చిత్రాల్లో నటించింది. ఇక సిద్ధార్థ్, అదితిరావు పెళ్లికి ఇరు కుటుంబాలు, కొంతమంది స్నేహితులకి మాత్రమే ఆహ్వానం అందింది. వీరి పెళ్లి తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ మండపంలో జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ మాత్రం ఇప్పటి వరకు బయటకురాలేదు.