Monday, December 23, 2024
Homeక్రైంజనవరిలో పెరిగిన సైబర్ నేరాలు

జనవరిలో పెరిగిన సైబర్ నేరాలు

Date:

సైబర్ క్రైమ్ కేసులు గతేడాది కంటే 2024లో పెరిగాయి. వాణిజ్య నగరం ముంబైలో 2024 ప్రారంభ నెల జనవరిలో సైబర్ క్రైమ్ లు అధిక సంఖ్యలో నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాది జనవరితో పోలిస్తే 15 శాతం సైబర్ నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్ లైన్ మోసాలు, ఉద్యోగాల పేరిట మోసాలు, పెట్టుబడి మోసాలు, అశ్లీల ఈమెయిల్స్, ఎంఎంఎస్ లు, ఎంఎంఎస్ రిలేటెడ్ నేరాలు నమోదు అయ్యాయి.

గణాంకాల ప్రకారం.. 2024 జనవరిలో 368 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. జనవరి 2023లో 323 కేసులు నమోద అయ్యాయి. ఇందులో 38 కేసులు పరిష్కరించబడ్డాయి. 42 మందిని అరెస్ట్ చేసినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఫోన్ వినియోగం పెరగడం వల్ల సైబర్ క్రైమ్ నేరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.ప్రజలు తమ ఫిర్యాదులను www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో ఫైల్ చేయొచ్చని, లేదా 1930 హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు తెలిపారు.