Wednesday, September 25, 2024
HomeUncategorized23 ర‌కాల శున‌క జాతుల‌పై నిషేధం

23 ర‌కాల శున‌క జాతుల‌పై నిషేధం

Date:

దేశంలో ప్ర‌మాద‌క‌ర జాతికి చెందిన శున‌కాల జాబితాను గురువారం కేంద్రం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో 23 ర‌కాల కుక్క‌లు ఉన్నాయి. దాంట్లో ఫిట్‌బుల్ టెర్రియ‌ర్‌, అమెరిక‌న్ బుల్‌డాగ్‌, రాట్‌వీల‌ర్‌, మాస్‌టిఫ్స్ జాతి కుక్క‌లు ఉన్నాయి. పెంపుడు కుక్క‌లుగా ఉన్న ఆ 23 ర‌కాల జాతి శున‌కాల‌ను దూరంగా ఉంచాల‌ని రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్రం త‌న ఉత్త‌ర్వుల్లో సూచించింది. ఈ 23 ర‌కాల జాతుల కుక్క‌ల‌ను ఇక ముందు బ్రీడింగ్ చేయ‌కుండా స్టెరిలైజ్‌ చేయాల‌ని కేంద్రం త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. కొన్ని ర‌కాల జాతి కుక్క‌ల‌ను బ్రీడింగ్‌కు దూరంగా ఉంచాల‌ని కోరుతూ పౌర సంఘాలు, జంతు సంక్షేమ సంస్థ‌ల నుంచి త‌మ‌కు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్లు ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ తెలిపింది. 23 ర‌కాల శున‌కాల‌ను ఫెరోసియ‌స్ బ్రీడ్ డాగ్స్‌గా ప‌రిగ‌ణించారు. వీటి వ‌ల్ల మ‌నుషుల‌కు ప్ర‌మాదం ఉన్న‌ట్లు తెలిపారు.

ఫిట్‌బుల్ టెర్రియ‌ర్‌, అమెరిక‌న్ బుల్‌డాగ్‌, రాట్‌వీల‌ర్‌, మాస్‌టిఫ్స్, సౌత్ ర‌ష్య‌న్ షెప‌ర్డ్ డాగ్‌, టోర్న్‌జాక్‌, స‌ర్‌ప్లానినాక్‌, జ‌ప‌నీస్ టోసా, అకిత‌, మాస్‌టిఫ్స్‌, టెర్రైర్స్‌, రొడేషియా రిడ్జ్‌బ్యాక్‌, వోల్ఫ్ డాగ్స్‌, కెనారియో, అక్బాస్ డాగ్‌, మాస్కో గార్డ్ డాగ్‌, కేన్ కోర్సో, బందోగ్ జాతి కుక్కలు ఆ లిస్టులో ఉన్నాయి.