Wednesday, September 25, 2024
HomeUncategorizedతెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్‌..

తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్‌..

Date:

దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అనూహ్య స్పందన వస్తోంది. మంగళవారం ప్రధాని మోడీ 10 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించారు. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన రైళ్ల సంఖ్య 50కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో ఇది రెండో వందేభారత్‌ ట్రైన్‌.

ఈ ట్రైన్ గురువారం రోజున మినహాయించి ఇతర రోజుల్లో ఈ వందే భారత్‌ రైలు అందుబాటులో ఉండనుంది. ఈ రైలు మార్చి 13వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. అయితే టికెట్స్‌ బుకింగ్స్‌ మాత్రం 12వ తేదీ నుంచే అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చిన మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సమయ వేళలను పరిశీలిస్తే.. సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ (20707) ప్రతి రోజు ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు శాఖకు చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండి, సామర్లకోట స్టేషన్‌లలో స్టాప్‌ ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రయాణికుల సామర్థ్యం 530 మంది. ఇందులోఏడు చైర్ కార్ కోచ్‌లు ఉండగా, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే విశాఖ నుంచి బయలుదేరే సమయ వేళలను పరిశీలిస్తే.. అదే రోజు విశాఖ నుంచి మధ్యా్‌హ్నం 2.35 గంటలకు బయలేరి రాత్రి11.20 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది.