Tuesday, September 24, 2024
HomeUncategorizedఆధ్యాత్మికతను పెంచే కాలం రంజాన్

ఆధ్యాత్మికతను పెంచే కాలం రంజాన్

Date:

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఒక పవిత్ర మాసం. ఈ సంవత్సరం మార్చి 11న అంటే సోమవారం నుంచి రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ నెలలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికతను పెంచే కాలం కూడా. ఈ నెలలో ముస్లింలు ఆత్మశోధన చేసుకుంటూ దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. అయితే నెలంతా ఫాస్టింగ్ చేసే ఈ నెలలో ముస్లింలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసం విరమించే (ఇఫ్తార్) విధానం, తెల్లవారుజామున తినే (సుహూర్) ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

*ఉపవాసం విరమణ (ఇఫ్తార్)

ముస్లింలు సాధారణంగా ఇఫ్తార్‌ను ఖర్జూరం, నీరు లేదా పాలతో ప్రారంభిస్తారు. ఖర్జూరాల (Dates)లో నేచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి ఇన్‌స్టంట్ ఎనర్జీని అందిస్తాయి. వీటిలోని మినరల్స్ ఉపవాసం వల్ల కోల్పోయిన ఎనర్జీని తిరిగి నింపుతాయి. ఖర్జూరాలు తిన్న తర్వాత, సమతుల్య భోజనం చేయాలి. బ్రౌన్ రైస్ లేదా హోల్ వీట్ బ్రెడ్, చికెన్ లేదా లెంటిల్స్ వంటి లీన్ ప్రొటీన్లు, వివిధ రకాల కూరగాయల వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను డైట్‌లో చేర్చాలి. సూప్‌లు, కూరలు కూడా ఆరోగ్యకరమే, ఎందుకంటే అవి శరీరానికి కావాల్సిన పోషకాలు, నీటిని సమృద్ధిగా అందిస్తాయి.

  • రంజాన్ ఫాస్టింగ్ ప్లాన్

తెల్లవారుజామున చేసే సుహూర్ కోసం, పోషకాలు ఎక్కువగా ఉండే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. వోట్స్, హోల్ వీట్ బ్రెడ్, క్వినోవా వంటి తృణధాన్యాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్లు, పప్పు, పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో హెల్తీ ఫ్యాట్ లభిస్తుంది. ఈ ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. రక్తప్రవాహంలోకి చక్కెరలను నెమ్మదిగా విడుదల చేస్తాయి. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు తాగాలి.

  • షుగర్ పేషెంట్లకు వైద్య సలహా

రంజాన్ సమయంలో చాలా రోజులపాటు ఉపవాసం ఉంటే గ్లూకోజ్ హోమియోస్టాసిస్‌లో మార్పు వస్తుంది. దీంతో డయాబెటిస్ బాధితులు జాగ్రత్తగా ఉండాలి. పగటిపూట ఆహారం, ద్రవాలు తీసుకోపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ముఖ్యంగా హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియా ముప్పు పెరుగుతుంది. ఉపవాసం సురక్షితమో కాదో నిర్ధారించడానికి ఎండోక్రినాలజిస్ట్ లేదా సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్‌ను సంప్రదించాలి. తీసుకునే మెడిసిన్స్ విషయంలో కూడా తగిన సర్దుబాట్లు చేసుకోవాలి. అలానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.

  • తినకూడని ఆహారాలు

డీప్‌ఫ్రైడ్ ఐటెమ్స్, పంచదారతో చేసిన స్నాక్స్, హైలీ ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి అసౌకర్యం కలిగిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. హైడ్రేటెడ్‌గా ఉండటానికి, ఉపవాసం లేని సమయాల్లో పుష్కలంగా నీరు తాగాలి. హెర్బల్ టీలు లేదా పండ్లతో కలిపిన నీరు వంటివి కూడా తాగవచ్చు.

  • ఉపవాసం ప్రయోజనాలు

రంజాన్ సమయంలో ఉపవాస దీక్ష పాటిస్తూ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చుకోవచ్చు. బెటర్ గ్లైసెమిక్ కంట్రోల్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఫాస్టింగ్ చేస్తే ఆటోఫాగీ యాక్టివేట్ అవుతుంది. ఆటోఫాగీ అనేది దెబ్బతిన్న భాగాలు రీసైకిల్ చేసే సెల్యులార్ ప్రాసెస్. ఇది వయసుతో పాటు వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉపవాసం సమయంలో కేలరీలు తక్కువ తీసుకుంటారు కాబట్టి బరువు తగ్గవచ్చు. ఈ సమయంలో వ్యాయామం కూడా చేయవచ్చు.