Monday, December 23, 2024
Homeక్రైంపెళ్లి బస్సుపై తెగిపడిన కరెంట్ తీగ

పెళ్లి బస్సుపై తెగిపడిన కరెంట్ తీగ

Date:

పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై హైటెన్షన్‌ కరెంట్‌ వైరు తెగి పడింది. దీంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గాజీపుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా కాలిన గాయాలపాలైన మరో 10 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పు ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించారు.