Tuesday, September 24, 2024
HomeUncategorizedనగర అభివృద్ధికి అడ్డుపడితే బహిష్కరిస్తా

నగర అభివృద్ధికి అడ్డుపడితే బహిష్కరిస్తా

Date:

నగర అభివృద్ధికి అడ్డు తగిలే వారందరిని బహిష్కరిస్తామని, హైదరాబాద్ మెట్రో విస్తరణకు కొంతమంది అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ బైరామాల్ గూడా ఫ్లై ఓవర్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. ఎల్ బీ నగర్ ప్రజలు తనకు ఎప్పుడూ అండగా నిలబడతారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. అభివృద్ధిలో భాగంగా రూ. 196 కోట్లతో బైరామల్ గూడా లెవల్ 2 ఫ్లై ఓవర్ ను ఓపెన్ చేశామన్నారు. నగరంలో పేదల ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ మేరకు అడుగులు పడుతున్నాయని చెప్పారు. మూసీ నది అభివృద్ధి చేయడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. హైదరాబాద్ కాలుష్యాన్ని తీసుకెళ్లి నల్లగొండ జిల్లాలో కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, ఐటీ కంపెనీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.