Tuesday, September 24, 2024
HomeUncategorizedతండ్రి లేదు.. తల్లి ఆరోగ్యం బాగోలేదు..

తండ్రి లేదు.. తల్లి ఆరోగ్యం బాగోలేదు..

Date:

బీహార్ లో ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం పేపర్ల ఇన్విజిలేషన్ జరుగుతోంది. అయితే తమను పరీక్షల్లో పాస్ చేయాలని కోరుతూ ప్రశ్నపత్రాల్లో కొందరు విద్యార్థులు విచిత్ర ధోరణి కోరుకుంటున్నారు. ఈ ఘటనలన్నీ బీహార్ ఇంటర్ బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో చోటు చేసుకున్నాయి. తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షలో ఫిజిక్స్ పేపర్‌లోని ఓ ప్రశ్నకు.. జముయిలోని ఓ విద్యార్థి.. విచిత్రమైన ఆన్సర్ రాశాడు. అది చూసిన ఇన్విజిలేటర్ అవాక్క అయ్యారు. పేపర్ లో విద్యార్థి తన బాధలు చెపుతూ ఇలా రాసారు. నమస్కారం మేడమ్ లేదా సార్.. నేను జ్యోతి సార్, దయచేసి నా మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది చెప్పడం నాకు చాలా ముఖ్యం. మీరందరూ నా మాటలు నమ్మరని నాకు తెలుసు సార్, మా నాన్న చనిపోయారు, 10 చాలా రోజులుగా ఇది జరిగింది మరియు నేనేమీ చదువుకోలేదు, పైగా నా ఆరోగ్యం కూడా బాగోలేదు, ఇంకా నేను పరీక్ష పెట్టడానికి వచ్చాను, ప్లీజ్ సార్ నాకు నంబర్ ఇవ్వండి, ప్లీజ్ సార్ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సార్. అంటూ రాసుకొచ్చారు. ఎమోషనల్ మెసేజ్‌లతో కూడిన ఈ పరీక్షా పత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

తాను మంచి విద్యార్థిని అని రాశాడు. మరికొందరు విద్యార్థులు కూడా ఈ విధంగానే రాసి తమను ఎలాగైనా పాస్ చేయాలని కోరారు. దీనిపై విద్యాశాఖాధికారి కుమారి రంజు మాట్లాడుతూ.. కొందరు విద్యార్థులు జవాబు పత్రాలపై ఇటువంటి రాతలు రాస్తున్నారని, పరీక్షల్లో ఇటువంటివి రాయకూడదని టీచర్లు తరగతి గదిలోనే విద్యార్థులకు చెప్పాలని అన్నారు. భావోద్వేగ సందేశాలు రాయడం వల్ల మార్కులు రావని.. సబ్జెక్ట్ ప్రశ్నలకు నేరుగా సమాధానాలు రాయాలని.. సూచిస్తున్నారు. మొత్తానికి విద్యార్థులు ప్రశ్నా పత్రాల్లో రాసిన రాతలు ప్రస్తుతం వైరల్ వైరల్ గా మారాయి.