ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వివిధ అంశాలపై వందలాది సినిమాలు వస్తుంటాయి. కొన్నాళ్లుగా చాలా దేశాల్లో హారర్ సినిమాలు ఎక్కువగా తీస్తూనే ఉన్నారు. వాటిని జనాలు కూడా చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొందరైతే వాటిని చూడగానే చచ్చేంత భయపడతారు. గ్రుడ్జ్, అన్నాబెల్లె మొదలైన అనేక హాలీవుడ్ సినిమాలు ఈ జాబితాలో ఉంటాయి. అయితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో ఒక సినిమా ఇప్పుడు ప్రజలను తెగ భయపెడుతోంది. ఈ సినిమాను ఎవరు చూస్తున్నారో, ఇది ప్రపంచంలోనే భయంకరమైన హారర్ మూవీ అని నమ్ముతారు. 100 మందిలో ఒక్కరూ మాత్రమే దీనిని చూడగలరు. బలహీన గుండె కలిగినవాళ్లు ఈ మూవీకి దూరంగా ఉండాలని కొందరు సినిమా రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు.
డైలీ స్టార్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. స్పానిష్ సినిమా “వెరోనికా” 2017 సంవత్సరంలో థియేటర్లలో విడుదలవగా.. ఇది 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా కథ ఏంటంటే 1991 లో మాడ్రిడ్ లో ఒక యుక్తవయసులో ఉన్న అమ్మాయి తన తమ్ముళ్లను చూసుకోవడానికి ఇంటి దగ్గర వదిలివేయబడుతుంది. కానీ ఇంట్లో వింత సంఘటనలు జరగడం ప్రారంభిస్తాయి..ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూడాల్సిందే.
మంచి రేటింగ్ నమోదు
నెట్‌ఫ్లిక్స్ ప్రకారం, 100 మందిలో ఒకరు మాత్రమే ఈ చిత్రాన్ని చూడగలరు. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ యూవీకి పాకో ప్లాజా దర్శకత్వం వహించారు. ఫెర్నాండో నవారో, కోరల్ క్రజ్ కూడా ఈ సినిమాకి సహ రచయితలుగా ఉన్నారు. ఈ మూవీలో సాండ్రా ఎస్కాసినా, బ్రూనా గొంజాలెస్,క్లాడియా ప్లేసర్ నటించారు. ఈ సినిమా IMDbలో 10కి 6.2 స్టార్ రేటింగ్‌ను అందుకుంది.
నిజమైన కథ ఆధారంగా
ఈ చిత్రం ఎస్టీఫానియా గుటిరెజ్ లాజారో అనే నిజమైన 18 ఏళ్ల అమ్మాయి ఆధారంగా రూపొందించబడింది. ఆ అమ్మాయి ఒక భయంకరమైన గేమ్ ఆడేది, దాని ద్వారా చనిపోయిన వారితో మాట్లాడేది. ప్రక్రియకు అంతరాయం ఏర్పడినప్పుడు ఆమె ఒకప్పుడు ఆత్మతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించింది. ఆరు నెలల తర్వాత ఎస్టీఫానియాకు మూర్ఛలు, భ్రాంతులు రావడం ప్రారంభించాయి. చాలా సార్లు ఆమ తను తన సోదరులపై తీవ్ర కోపం తెచ్చుకునేది. తన గది ముందు దుష్టశక్తులు వెళ్లడం చూసేదానినని తను చెప్తుండేది. 1991 లో ఎస్టీఫానియా మృతదేహం గదిలో కనుగొనబడిందిశ కానీ మరణానికి కారణం ఎవరికీ తెలియదు.