Sunday, December 22, 2024
Homeక్రైంఅల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొంటే ప్రమాదమే

అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొంటే ప్రమాదమే

Date:

బిజీ జీవితంలో చాలా మంది బయట తినడానికి ఆసక్తి చూపుతున్నారు. బయట ఆహారం కల్తీ ఉందని ఇంట్లో వంట చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. అయితే ఇంట్లో వంట చేసుకునే వారు కూరగాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి, ఆయిల్, ఇతర ఇంగ్రిడయన్స్ అన్ని బయటనే కొంటున్నారు. ఇంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి మనం తయారు చేసుకుంటే మంచిది. మార్కెట్ లో దొరుకుతుంది కదా అని రెడిమెట్ తీసుకొచ్చుకుంటే మన ఆరోగ్యం మనమే నాశనం చేసుకున్నట్టు.

తాజాగా హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీగా బయట పడింది. కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 7 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ పల్లిలో డక్కన్ ట్రేడర్స్ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. వీటిని షాపుల్లో వేసి అమ్మిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయగా ఈ బాగోతం బయట పడింది.

నాసిరకం అల్లం, వెల్లుల్లి తయారు

నిందితుల నుంచి 625 కేజీల నాసిరకం వెల్లుల్లి, 100 కిలోల నాసిరకం అల్లం, కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కల్తీ జింజర్ పేస్ట్ విలువ ఐదు లక్షల ఉంటుందని అంచనా. బేగంబజారులోని రెండు దుకాణాల్లో పోలీసులు సోదాలు చేశారు. పెద్ద మొత్తంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లభ్యమైవడంతో అవి ఎక్కడి నుంచి తెచ్చారో ఆరా తీశారు. దీంతో డక్కన్ ట్రేడర్స్ దాడులు చేశారు. నిందితులు పాటిగడ్డకు చెందిన పాండు రంగారావు, డెక్కన్ ట్రేడర్స్ యజమాని రహీం, అజయ్ కుమార్, అహీర్, తెలంగాణ ఏజెన్సీ యాజమాన్యం ప్రదీప్ సంక్లా అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు గుజరాత్ కు చెందిన రహీం చరణీయగా గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తిన్నట్లయింతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకు అల్లం, వెల్లుల్లి కొని మనమే పేస్ట్ తయారు చేసుకోవాలని చెబుతున్నారు. పసుపు కూడా కొమ్ములు కొనుక్కొని పసుపు చేసుకోవాలని సూచిస్తున్నారు.