Monday, September 23, 2024
HomeUncategorizedమేడారం జాతరకు ఎక్కువ బస్సులు

మేడారం జాతరకు ఎక్కువ బస్సులు

Date:

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్​ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నం.

జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించాం. దీంతో సాధారణ ప్రయాణీకులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలి’ అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా జనరల్​ప్యాసింజర్లకు రిక్వెస్ట్ చేశారు.