Monday, September 23, 2024
HomeUncategorizedమేడారంలో భక్తురాలికి గాయం

మేడారంలో భక్తురాలికి గాయం

Date:

మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మ జాతరలో గద్దెల వద్ద భక్తులు కొబ్బరి కొడుతున్న సందర్భంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీజ అనే భక్తురాలి పెదవికి గాయం అయింది. భక్తురాలు ఇబ్బంది పడుతుండడంతో అక్కడే ఉన్న సింగరేణి రెస్క్యూ టీం వైద్య సిబ్బంది వెంటనే భక్తురాలు శ్రీజను తిరుమల తిరుపతి కళ్యాణ మండపంలో ఉన్న వైద్య కళాశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం శ్రీజ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు పలు రకాల టీంలు సిద్ధంగా ఉన్నారు.