Friday, January 3, 2025
Homeక్రైంక్రెడిట్ కార్డు బిల్లు కట్టాలని వేధింపులు

క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలని వేధింపులు

Date:

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్‌​కు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిజానికి సురేశ్​ స్వస్థలం లాలాపేట్, అతని భార్య భాగ్యది మారేడ్‌పల్లి. సురేష్ దంపతులు కీసరలో స్థిరపడ్డారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై, శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకి కారణం క్రెడిట్ కార్డ్ అధికారులు అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టారు.

క్రెడిట్ కార్డు సంబందించిన అధికారులు ఇంటికి వచ్చి బిల్లు కట్టమని ఇబ్బంది పెట్టడంతో, స్థానికంగా ఉన్న ఇరుగు పొరుగు ముందు తమ పరువు పోయిందనీ మానసికంగా ఇబ్బంది పడినట్లు సూసౌడ్ నోట్‌​లో పేర్కొన్నారు. తమ పిల్లలను బంధువుల ఇంటికి పంపి, ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.