Sunday, September 22, 2024
HomeUncategorizedఆడ సింహానికి 'సీత' పేరు ఏలా పెడుతారు

ఆడ సింహానికి ‘సీత’ పేరు ఏలా పెడుతారు

Date:

ఆడ సింహానికి ‘సీత’ అని పేరుపెట్టడంపై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) హైకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టులోని జల్పాయిగురి సర్క్యూట్ బెంచ్‌ హిందూ సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆడ సింహానికి ఎలాంటి పేరు పెట్టలేదని పార్క్ అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఫిబ్రవరి 12న త్రిపురలోని సెపాహిజాలా జూలాజికల్ పార్క్ నుండి రెండు సింహాలను తీసుకొచ్చారు. ఆడ సింహానికి ‘సీత’ అని, మరో సింహానికి ‘అక్బర్’ అని పేరు పెట్టారని వీహెచ్‌పీ పేర్కొంది. ఫిబ్రవరి 16 వీహెచ్‌పీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఫిబ్రవరి 20న కోర్టు సింగిల్ బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రావచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది శుభాంకర్ దత్తా తెలిపారు.

జంతువుకు ఇలా పేర్లు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని, ఆడ సింహం పేరు మార్చాలని పిటిషన్ కోరారు. భవిష్యత్తులో ఏ జూలాజికల్ పార్క్‌లోని ఏ జంతువుకు ఏ మతానికి చెందిన దేవుళ్లు మరియు దేవతల పేర్లు పెట్టకూడదని కూడా కోరినట్లు దత్తా చెప్పారు. జంతువుల మార్పిడిలో భాగంగా బెంగాలీ సఫారీ పార్క్‌కి IL26 మరియు IL27 అనే రెండు సింహాలు వచ్చాయి, ఈ సింహాల్లో ఒకదానికి సీత అనే పేరు పెట్టారని, తాము మీడియా నివేదికల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు వీహెచ్‌పీ తెలిపింది. పార్క్ అధికారులు మాత్రం, తాము ఇంకా ఎలాంటి పేర్లు పెట్టలేదని చెప్పారు.