Sunday, September 22, 2024
HomeUncategorizedమా ఎమ్మెల్యేలకు 25కోట్లు ఇస్తామన్నారు

మా ఎమ్మెల్యేలకు 25కోట్లు ఇస్తామన్నారు

Date:

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం మనం చూస్తున్నాం. మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్ నేతల్ని అరెస్టు చేయాలని వారు భావిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని, చెక్కుచెదరలేదని ప్రజలకు చూపించేందుకు నేను విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా” అని కేజ్రీవాల్‌ తెలిపారు. శనివారం ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.

విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా కేజ్రీవాల్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున ఇస్తామని భాజపా నేతలు సంప్రదించారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి చెప్పారని సీఎం సభలో వెల్లడించారు. తనను అరెస్టు చేసి ఆప్‌ సర్కారును పడగొడతామని కూడా వారు అన్నట్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసు నకిలీదని, తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని భాజపా చూస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని ఇటీవల రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.