Sunday, September 22, 2024
HomeUncategorizedగత ప్రభుత్వం వల్లే మ్యూజియం ఆలస్యం

గత ప్రభుత్వం వల్లే మ్యూజియం ఆలస్యం

Date:

మాజీ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని, ఆయనకు ఎన్ని లేఖలు రాసినా స్పందించ లేదని శుక్రవారం శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లో రాంజీ గోండు పేరుతో గిరిజన మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. దేశ వ్యాప్తంగా 10 ట్రైబల్ మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రాంజీ గోండు పోరాడారనికొనియాడారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసింది. గిరిజన వర్సిటీకి మొదటి విడతలో రూ.900 కోట్లు కేటాయించాం. రూ.420 కోట్లతో 17 ఏకలవ్య పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించాం. మేడారం జాతరకు రూ.3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. గిరిజనుల భూములకు హక్కులు కూడా కల్పిస్తున్నాం. వారి సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు.