Sunday, September 22, 2024
HomeUncategorizedడ్రోన్లను అడ్డుకునేందుకు గాలిపటాలు

డ్రోన్లను అడ్డుకునేందుకు గాలిపటాలు

Date:

పంటలు మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో సహా 12 డిమాండ్ల సాధనకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతు సంఘాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ”ఢిల్లీ ఛలో” పేరుతో ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. బారికేట్లు, ముళ్ల కంచెలను దాటుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్న రైతులు, ఆందోళనకారులపైకి పోలీసులు టియర్ గ్యాస్ వదులుతున్నారు. డ్రోన్ల సాయంతో వీటిని ఆందోళనకారులపై పడేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసుల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు రైతులు ‘గాలిపటాలు’ ఉపయోగిస్తున్నారు. డ్రోన్లను అడ్డుకునేందుకు గాలిపటాలతో సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లోని శంభు సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాలిపటాల దారాలు డ్రోన్ల రెక్కలకు చిక్కుకుని, అవి క్రాష్ అయ్యేలా చేస్తున్నారు. మరోవైపు రైతు సంఘాలతో మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఈ రోజు తెలిపారు. నిర్మాణాత్మక చర్చల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. సామాన్యుల సాధారణ జీవితానికి అంతరాయం కలిగించే చర్చలను నివారించాలని కోరారు.