Sunday, September 22, 2024
HomeUncategorizedఅసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

Date:

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలో రేవంత్ చేసిన కామెంట్స్ పైన బీఆర్ఎస్ నేతలు సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి బాష పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసారు. మీడియా పాయింట్ లో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు బడ్జెట్ పైన చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ తరఫున చర్చను ప్రారంభించిన కడియం శ్రీహరి.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పాలకులు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న రాద్దాంతంపై కూడా ఆయన విమర్శలు చేశారు. నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ప్రస్తావించారు. ఆ సమయంలో కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

నల్లగొండ సభలో కేసీఆర్‌ తన గురించి అవమానకరంగా మాట్లాడారని, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పాయింట్‌ పీకేసినా బుద్ధి మారలేదని వ్యాఖ్యానించారు. దాంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మార్షల్స్ అభ్యంతరం చెప్పారు. అనుమతి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎపుడు నిబంధన పెట్టారని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యేలు ..నిబంధన ఉంటే తమకు చుపించాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసారు. సిబ్బంది వారికి అనుమతి ఇవ్వకపోవటంతో అక్కడే నేల మీద బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.