తెలంగాణలో రుణమాఫీ చేయకుండా ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా కాలేదని మంత్రులే చెబుతున్నారని, వ్యవసాయశాఖ మంత్రి లెక్క ప్రకారం 22 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పారు. రైతులనే కాదు, రాహుల్ గాంధీని కూడా రేవంత్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియాతో సీఎం చేసేది చిట్‌చాట్ కాదని.. చీట్ చాట్ అని విమర్శించారు. లేనివి ఉన్నట్లు చెప్పి మోసం చేయడం రేవంత్‌కు అలవాటేనని మండిపడ్డారు.
”రుణమాఫీ విషయంలో రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొండారెడ్డిపల్లి లేదా సిద్దిపేట వెళ్లి రుణమాఫీపై రైతులను అడుగుదాం. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది నా సవాల్.. చేశారా? రుణమాఫీ సవాల్ ఏమైందో రైతులే చెబుతారు. రుణమాఫీ సభకు రావాలని సీఎం 3 సార్లు ఆహ్వానించినా రాహుల్ రాలేదు. ఆయన రాష్ట్రానికి వస్తే రుణమాఫీపై నిలదీస్తాం” అని హరీశ్‌రావు అన్నారు.