Friday, November 15, 2024
HomeUncategorizedపోలీసులపై మంత్రి భార్య ఆగ్రహాం

పోలీసులపై మంత్రి భార్య ఆగ్రహాం

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన తీరును తప్పుబట్టారు. మంత్రి రామ్‌ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు.

పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి.. ఇలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారు. రాయచోటిలో పోలీసులు తనకూ ఎస్కార్ట్‌గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.