పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఈ డాక్టర్ల నిరసన వల్ల పశ్చిమబెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా 23 మంది రోగులు మృతిచెందినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి హత్యాచారం తర్వాత బెంగాల్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ కేసుపై విచారణ సందర్భంగా బెంగాల్ సర్కారు తరపున కపిల్ సిబల్ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేటస్ రిపోర్టును ఆయన సీజే డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంకు సమర్పించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆ నివేదికను ఫైల్ చేసిందని, డాక్టర్ల సమ్మె వల్ల ఇప్పటి వరకు 23 మంది మరణించినట్లు సిబల్ తెలిపారు. సుప్రీం ధర్మాసనంలో జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా ఉన్నారు. సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టును పరిశీలిస్తున్నది.