Friday, September 27, 2024
HomeUncategorizedకరెన్సీ నోట్లపై నిద్రించిన నాయకుడు

కరెన్సీ నోట్లపై నిద్రించిన నాయకుడు

Date:

అస్సాంలోని ఉదాల్‌గిరి జిల్లాకు చెందిన బెంజామిన్‌ బసుమతారీ అనే నేత కరెన్సీ నోట్లపై నిద్రించిన ఓ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవన్నీ రూ.500 నోట్లే కావడం విశేషం. బోడోలాండ్‌ నేత అయిన బెంజామిన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసుల్లో నిందితుడు. ఆయన విలేజ్‌ కౌన్సిల్ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ పథకాల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని ఆ ఆరోపణల సారాంశం. ఈ క్రమంలోనే తాజా చిత్రం వైరల్ అవుతోంది. దాంతో అవినీతి వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన యునైటెడ్ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దాంతో యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్‌ బోరో ఎక్స్‌ వేదికగా స్పష్టత ఇచ్చారు. బెంజామిన్‌కు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ” ఈ ఏడాది జనవరి 10నే ఆయన మా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అలాగే ఫిబ్రవరి 10నే వీసీడీసీ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించారు. ఆయన చర్యలకు మా పార్టీతో ఎలాంటి సంబంధం లేదు” అని వెల్లడించారు.