Sunday, September 29, 2024
HomeUncategorizedఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే షుగర్ వ్యాధి ముప్పు

ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే షుగర్ వ్యాధి ముప్పు

Date:

మనిషికి నిద్ర చాలా అవసరం. వయస్సును బట్టి ఏ మనిషికి ఎంత నిద్ర అవసరమో చెప్పవచ్చు. కానీ మొబైల్ పుణ్యమాని మనిషి నిద్ర రోజురోజుకు తగ్గిపోతుంది. మనిషికి సరిపడా నిద్రలేకుంటే మధుమేహ వ్యాధి ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. యూకే బయోబ్యాంక్‌లోని 2.5 లక్షల మంది డాటాను అధ్యయనం చేసిన తర్వాత షుగర్‌ వ్యాధికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి మధుమేహ ముప్పును దూరం చేస్తుందని, ఇదే సమయంలో సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు.

సాధారణంగా ఒక మనిషి రోజుకు 7 – 8 గంటలు నిద్రపోవాలని, ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్న వారిలో షుగర్‌ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. రోజుకు 7 – 8 గంటలు నిద్రపోతున్న వారితో పోలిస్తే ఐదు గంటల పాటు నిద్ర పోతున్న వారిలో మధుమేహం బారిన పడే ముప్పు 16 శాతం ఎక్కువని, రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు నిద్రపోతున్న వారిలో 41 శాతం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. కచ్చితంగా రోజుకు 7 – 8 గంటల పాటు మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచించారు.