ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లో నీరు చేరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మృతి చెందడం చాలా దురదృష్టకరమని, కొద్దిరోజుల క్రితం వర్షాలకు విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఘటన వ్యవస్థల సంయుక్త వైఫల్యం. అసురక్షిత నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్య పౌరులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతీ పౌరుడి హక్కు. దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత” అని రాహుల్ ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.
సెంట్రల్ ఢిల్లీలోని రాజిందర్ నగర్‌లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లోకి వరద పోటెత్తి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు ఆదివారం కోచింగ్ సెంటర్ యజమాని, సమన్వయకర్తను అదుపులోకి తీసుకున్నారు.