రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ తోనే జరుగుతుంటాయని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనదారులపై బుధవారం కొరడా ఝలిపారు. నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్, డీసీపీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు సిటీ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మూడు గంటల్లో 688 కేసులు నమోదు చేశారు.
అలాగే చాలా మంది కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు. ఫైన్ పడినా లైట్ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కట్టుకుందాం లే అని అనుకుంటున్నారు.