పశ్చిమబెంగాల్ కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆగష్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై నిరసనలు చేస్తున్న వారిపై న్యాయవాది కౌస్తవ్ బాగ్చి రాళ్లు రువ్వుతున్నట్లు నిరూపించేందుకు తన వద్ద వీడియోలు, ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు. కౌస్తవ్ బాగ్చి బీజేపీ నేత.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. కపిల్ సిబల్ ఆరోపణలపై.. న్యాయవాది కౌస్తవ్ స్పందిస్తూ.. ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సీజేఐ కల్పించుకొని.. మీ ముందు ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. ముందు గొంతు తగ్గించుకొని మాట్లాడండి’ అంటూ హెచ్చరించారు.
‘గత రెండు గంటలుగా మీ ప్రవర్తనను గమనిస్తున్నాను. మీ మీ పిచ్‌ని ముందు తగ్గించడండి. మీరు న్యాయమూర్తులను ఉద్ధేశించి మాట్లాడుతున్నారు. కోర్టు వెలుపల ఉన్న గ్యాలరీని ఉద్దేశించి కాదు.’ అంటూ మండిపడ్డారు. దీంతో న్యాయవాది కౌస్తవ్ త్రిసభ్య ధర్మాసనానికి క్షమాపణలు తెలియజేశారు. చీఫ్ జస్టిస్ బాగ్చీని మందలించడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘పార్ట్‌టైమ్ న్యాయవాది, ఫుల్‌టైం బీజేపీ కార్యకర్త అయిన కౌస్తవ్ బాగ్చి నుంచి ఇంకా ఏం ఆశించగలమని మండిపడింది. తమ(బీజేపీ) పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మాదిరి కోర్టు గదిని బుల్డోజ్ చేయవచ్చని భావించే వీరి నుంచి ఇలాంటి ప్రవర్దనే ఉంటుందని విమర్శలు గుప్పించింది. నేడు సీజేఐ అతన్ని సరిగ్గా మందలించింది అంటూ తెలిపింది.