Tuesday, October 15, 2024
HomeUncategorizedమీ వివాహానికి మమ్మల్నీ ఆహ్వానించండి

మీ వివాహానికి మమ్మల్నీ ఆహ్వానించండి

Date:

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని వివాహం ఎప్పుడు చేసుకుంటారని కశ్మీరీ యువతులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 20, 30 ఏళ్లుగా ఈ ఒత్తిడిని అధిగమించానని చెప్పారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన రాహుల్‌.. శ్రీనగర్‌కు చెందిన పలువురు విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంలో పెళ్లి చేసుకోవడంపై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందా? అని రాహుల్‌ వారిని ప్రశ్నించారు. అదే సమయంలో మీ పెళ్లి ఎప్పుడు అంటూ రాహుల్‌నే ఎదురు ప్రశ్న వేశారు. దానికి నవ్వుతూ బదులిచ్చిన ఆయన.. ’20-30 ఏళ్ల నుంచి ఈ ఒత్తిడిని అధిగమించా’ అంటూ సమాధానమిచ్చారు.

వివాహం గురించి తదుపరి ప్రణాళికలు ఏంటని రాహుల్‌ని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అటువంటిదేమీ లేదన్నారు. కానీ,.. వాటిని తోసిపుచ్చలేమని చెప్పారు. దాంతో వివాహానికి మమ్మల్నీ ఆహ్వానించండి అంటూ అక్కడున్న విద్యార్థినులు కోరగా.. తప్పకుండా పిలుస్తానంటూ రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు.