Tuesday, October 15, 2024
HomeUncategorizedమంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించండి

మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించండి

Date:

దేశంలో మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జారీ చేసిన హెల్త్‌ అడ్వైజరీ ప్రకారం భారత్‌లో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్‌ కేసు కూడా నిర్ధరణ కాలేదు. దీని విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచించిన వ్యూహాలను అమలు చేయాలని పేర్కొంది.

దేశంలో మంకీపాక్స్‌ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎయిర్‌ పోర్టుల్లో మంకీపాక్స్‌ స్క్రీనింగ్‌ మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించింది. అనుమానిత కేసులను పరీక్షించేందుకు వీలుగా ఐసీఎంఆర్‌ ఆధీనంలోని పరిశోధనాశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు హెల్త్‌ మినిస్ట్రీ పేర్కొంది. రాష్ట్రాలు చర్మ, ఎస్‌టీడీ వ్యాధులకు చికిత్స చేసే క్లీనిక్స్‌పై దృష్టిపెట్టాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కనిపించిన పేషెంట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ వ్యాధి, దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజల్లో అనవసర భయాలు పొగేట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ తన అడ్వైజరీలో పేర్కొంది.