Thursday, October 10, 2024
HomeUncategorizedభ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక హిందూ మ‌తంలోకి ముస్లిం మ‌హిళ‌

భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక హిందూ మ‌తంలోకి ముస్లిం మ‌హిళ‌

Date:

భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారింది. హిందూ మతంపై తనకున్న అచంచల విశ్వాసాన్ని తెలుపుతూ ఆ మహిళ తన కుమారులకు లవ్-కుష్ అని పేరు పెట్టింది. త‌న పేరును మెహనాజ్ బికి బదులుగా మీనాక్షిగా మార్చుకుంది. సనాతన సంప్రదాయంలో మహిళలకు ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని తాను హిందూమతంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ధమ్నార్ గ్రామంలో నివసిస్తున్న మెహనాజ్ (30), 12 మరియు 11 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం మందసౌర్‌లోని గాయత్రి ఆలయంలో హిందూ మతంలోకి మారింది. సుమారు గంటన్నరపాటు మంత్రాలు పఠించిన తర్వాత తమ కొడుకలకు నామకరణం చేశారు. అనంతరం.. మెహనాజ్ మాట్లాడుతూ, సనాతన ధర్మంలో మహిళలకు గౌరవం ఉందని యూట్యూబ్‌లో, ఇతర ప్రాంతాల్లో చూసేదానినని చెప్పింది. కుటుంబంలో వారికి గౌరవం ఉంటుంది. ఈ క్రమంలోనే.. హిందూ సంస్థకు చెందిన వారిని సంప్రదించి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు మెహనాజ్ బీ(మీనాక్షి) చెప్పుకొచ్చింది. మెహనాజ్ బీకి 15 సంవత్సరాల క్రితం ధన్మార్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్‌తో వివాహం జరిగింది. మొదట్లో అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత భర్తతో పాటు అత్తమామల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని తెలిపింది. చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయని.. ఏ చిన్న సమస్య వచ్చినా తిడుతూ కొట్టేవాడని పేర్కొంది. ఈ విషయం తన నాన్నకు చెప్పగా, ఇది మీ కుటుంబ విషయం అని అన్నాడని చెప్పింది.