మహిళలకు సురక్షితమైన ప్రదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాదని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. సమాసంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉండేలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం మహిళలు భయపడుతున్నారని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఆర్‌జీ ఖర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఘటనపై ఆయన స్పందించారు. బాధితురాలి తల్లి మనోభావాలను తాను గౌరవిస్తానన్నారు. రక్షా బంధన్ సందర్భంగా రాజ్‌భవన్‌లో మహిళా నేతలు, వైద్యులతో గవర్నర్ సమావేశమయ్యారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని.. ఇది ఇకపై కొనసాగదన్నారు. మన ఆడబిడ్డలను, సోదరీమణులను కాపాడుకుంటామని ప్రమాణం చేయాలన్నారు. మహిళలు సంతోషంగా, సురక్షితమని భావించే సమాజం ఉండాలన్నారు.