Tuesday, October 15, 2024
HomeUncategorizedబిడ్డా.. బాగున్నవా..? ప్రాణం మంచిగున్నదా..?

బిడ్డా.. బాగున్నవా..? ప్రాణం మంచిగున్నదా..?

Date:

తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన కవితకు కేసీఆర్ ఫోన్ చేశారు.. బిడ్డా… ఎట్లున్నవ్‌ ? పాణం మంచిగున్నదా?’ ఢిల్లీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలైన తన కుమార్తె కవితను మాజీ సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలివి. మంగళవారం రాత్రి తిహాడ్‌ జైలు నుంచి విడుదలై బయటికొచ్చిన కవిత కారులో ఎక్కి కూర్చోగానే తన తండ్రి కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడినట్టు తెలిసింది. నాన్నా.. అని పిలుస్తూ భావోద్వేగానికి గురయ్యారు. 

కాసేపటి దాకా ఆమె నోటి వెంట మాటలు రాలేదు. తండ్రి గొంతు వినగానే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కుమార్తెను ఓదార్చిన కేసీఆర్‌.. బిడ్డా… ఎట్లున్నవ్‌? పాణం మంచిగున్నదా? అని అడిగారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అంతేకాక, బాధ పడకు! ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో! అని కేసీఆర్‌ జాగ్రత్తలు చెప్పినట్లు సమాచారం. కవిత కూడా కేసీఆర్‌ను… మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నారా? అని కుశల ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. తిహాడ్‌ జైలు నుంచి విడుదలైన కవిత మంగళవారం రాత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. భర్తభర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఆమె హైదరాబాద్‌ చేరుకోనున్నారు. హైదరాబాద్‌ చేరిన వెంటనే నేరుగా ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్‌ వద్దకు వెళ్లనున్నారు.