ప్రపంచంలోనే మొదటి ‘పోర్టబుల్ హాస్పిటల్’ను భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. విజయవంతంగా ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశాయి. సొంతంగా తయారు చేసిన ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి ఐఏఎఫ్‌కు చెందిన రవాణా విమానం ద్వారా అనుకొన్న లక్షిత ప్రాంతంలో ప్యారాచూట్ సాయంతో జారవిడిచినట్టు రక్షణ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి.
మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ట్రామా కేర్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్‌లను తరలించారు. ప్రాజెక్ట్ ‘బీహెచ్ఐఎస్‌హెచ్ఎం’లో భాగంగా ఈ క్యూబ్‌లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను తరలించేందుకు ఐఏఎఫ్ ఆధునాతన వ్యూహాత్మక సీ-130జే సూపర్ హెర్క్యూలస్ రవాణా విమానాన్ని వినియోగించింది. ఈ ఆపరేషన్‌లో ఆర్మీకి చెందిన పారా బ్రిగేడ్ కీలక పాత్ర పోషించిందని రక్షణ శాఖ తెలిపింది.