Thursday, October 10, 2024
HomeUncategorizedదగ్గు మందు పేరుతో విషం అమ్ముతున్నారు

దగ్గు మందు పేరుతో విషం అమ్ముతున్నారు

Date:

ఇండియాలో గతకొన్ని సంవత్సరాలుగా 100కు పైగా కంపెనీలు చిన్న పిల్లల దగ్గుమందు టానిక్ లను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు సరఫరా చేస్తున్నారు. ఇండియాలో 100కు పైగా ఫార్మా కంపెనీలు ఔషదాలు అంటూ.. విషాన్ని అమ్ముతున్నాయి. గాంబియా, ఉజ్బెకిస్తాన్ మరియు కామెరూన్‌ దేశాల్లో పదుల సంఖ్యలో పిల్లల మరణాలకు ఆ టానిక్ లే కారణమైయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లోనే తేల్చి చెప్పింది. గాంబియా దేశంలో 2022 మేలో 66 మంది చిన్నారులు ఇండియా ఉత్పత్తి చేసిన దగ్గు మందుల కారణంగా చనిపోయారనే వార్త అప్పట్లో కలకలం రేపింది. ఆయా దేశాలు కొన్ని రకాల టానిక్ లను అప్పుడే బ్యాన్ చేశాయి.

*నాణ్యతా ప్రమాణాలు లేవు*

భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్‌లు క్వాలిటీ పరీక్షలో ఫెయిల్‌ అయ్యాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ దగ్గు మందుల్లోని కొన్ని శాంపిళ్లలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ వంటి విష పదార్థాలు ఉన్నాయని తేలింది. డీఈజీ, ఈజీ, అస్సే, మైక్రో బ్యాక్టిరియా పెరుగుదల, పీహెచ్‌ వాల్యూ వంటి వాటి కారణంగా ఆయా సిరప్‌ల బ్యాచ్‌లను నాణ్యతా ప్రమాణాలు లేని వాటిగా అధికారులు గుర్తించారు.

*మరణాలకు దగ్గు మందే కారణం*

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగాల సహాయంతో ఆయా కంపెనీల సేల్స్, డిస్ట్రిబూషన్ గుర్తించి ప్రొపైలిన్ గ్లైకాల్ పంపిణీదారులను తనిఖీ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 141 మంది చిన్నారుల మరణాలకు భారత్‌లో ఉత్పత్తి అయిన దగ్గు మందులే కారణమని ఆరోపణలు రావడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లు దేశవ్యాప్తంగా టెస్టింగ్‌లు చేస్తున్నాయి.