Tuesday, October 15, 2024
HomeUncategorizedతెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐల సహకారం కావాలి

తెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐల సహకారం కావాలి

Date:

తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం చాలా అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (యూఎస్ఏ) సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు ఎన్ఆర్ఐల కృషి చాలా ఉంది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల రాష్ట్రంగా మార్చారు. పదేళ్ల విధ్వంస తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఎన్ఆర్ఐల సహకారం అవసరం. రాష్ట్రం ఆర్థికంగా, దృఢంగా అభివృద్ధి చెందాలంటే ఉచితాలు మంచివి కావు. కానీ.. ప్రస్తుతం కొందరు పేదలు, అర్హులకు అవసరం. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పించాలి. చేతి వృత్తులను ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి రాకూడదు. ప్రతి తెలంగాణ బిడ్డకు మెరుగైన విద్య, వైద్యం అవసరం. రాష్ట్రానికి ఆదాయ మార్గాలు సమకూరినప్పుడే ఏదైనా సాధ్యం. అందుకే పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాం” అని సీఎం రేవంత్‌ అన్నారు. అంతకుముందు భారీ కార్ల ర్యాలీకి నాయకత్వం వహించిన నరేందర్‌రెడ్డికి, తమ వ్యక్తిగత పనులు మానుకుని సభను విజయవంతం చేసిన టీమ్‌, వాలంటీర్లకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.