సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశం దొరికినా క్షణాల్లో లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. సైబర్ నేరాల బారిన పడిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండగా నిలుస్తోంది. సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న నగదును లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో రీఫండ్ చేస్తోంది. మార్చి నుంచి జులై వరకు రూ.85.05 కోట్ల నగదును రీఫండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,449 కేసుల్లో బాధితులకు ఆ మొత్తాన్ని తిరిగి అప్పగించింది. అత్యధికంగా సైబరాబాద్‌లో పరిధిలోని బాధితులకు రూ.36.8 కోట్లు ఇచ్చారు. నగదు పొగొట్టుకున్న మొదటి గంట(గోల్డెన్ అవర్)లో ఫిర్యాదు చేస్తే నేరగాళ్లకు సొమ్ము చేరకుండా ఆపగలమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.