ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు అనుమతి లభించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇదే కేసుకు సంబంధించి నమోదైన అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌నూ విచారించనున్నట్లు తెలిపింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బావేజాకు సీబీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఢిల్లీ మద్యం విధానం కేసులో కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 27న ముగియనుంది. ఇదే సమయంలో కేజ్రీవాల్, పాఠక్‌లను ప్రశ్నించేందుకు అవసరమైన అనుమతుల కోసం 15 రోజుల సమయం ఇస్తున్నట్లు ఆగస్టు 12 న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలోనే సీఎం ప్రశ్నించేందుకు అనుమతి పొందినట్లు సీబీఐ పేర్కొంది. మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.