Thursday, October 10, 2024
HomeUncategorizedఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Date:

ఉత్తరప్రదేశ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్​పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో హత్రాస్‌ నుంచి ఆగ్రాకు వెళ్తున్న వ్యానును.. ఆగ్రా- అలీగఢ్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 15 మంది మరణించారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కు చేరింది. మరో 16 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. వారిలో 11 మందిని హాథ్రస్ హాస్పిటల్‌కు, ఐదుగురిని అలీగఢ్ దవాఖానకు తరలించామన్నారు.

మృతులను ఇర్షాద్ (25), మున్నె ఖాన్ (55), ముస్కాన్ (16), తల్లి (28), తబస్సుమ్ (28), నజ్మా (25), భోలా (25), ఖుష్బు (25), జమీల్ (50), చోటే (25), అయాన్ (2), సుఫియాన్ (1), అల్ఫాజ్ (6), షోయబ్ (5), ఇష్రత్ (50), అప్పి (2), గుల్షన్‌గా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.