Thursday, October 10, 2024
HomeUncategorizedఅనుమ‌తి లేని 13కోచింగ్ సెంట‌ర్లు సీజ్‌

అనుమ‌తి లేని 13కోచింగ్ సెంట‌ర్లు సీజ్‌

Date:

ఢిల్లీలో రావూస్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో శనివారం రాత్రి జరిగిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న సుమారు 13 కోచింగ్‌ సెంటర్లను గుర్తించారు. సెల్లార్లలో అక్రమంగా నిర్వహిస్తున్న ఆయా కోచింగ్‌ సెంటర్లను సీజ్‌ చేశారు. ఐఏఎస్‌ గురుకుల్‌, చాహల్‌ అకాడమీ, ఫ్లూటస్‌ అకాడమీ, సాయి ట్రేడింగ్‌, ఐఏఎస్‌ సేతు, టాపర్స్‌ అకాడమీ, దైనిక్‌ సంవాద్‌, సివిల్స్‌ డైలీ ఐఏఎస్‌, కెరీర్‌ పవర్‌, 99 నోట్స్‌, విద్యా గురు, గైడెన్స్‌ ఐఏఎస్‌, ఐఏఎస్‌ కోసం ఈజీ సెంటర్లు బేస్‌మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వాటికి సీజ్‌ చేసి అందులో చదువుకుంటున్న అభ్యర్థులను ఖాళీచేయాలని సూచించారు. ఈ మేరకు ఆయా కోచింగ్‌ సెంటర్ల ముందు అధికారులు నోటీసులు అంటించారు.

శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్‌ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.