Tuesday, October 15, 2024
HomeUncategorizedఅండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీల‌కు సుప్రీంకోర్టు శుభ‌వార్త‌

అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీల‌కు సుప్రీంకోర్టు శుభ‌వార్త‌

Date:

కొన్ని ఏళ్ల నుంచి దేశ‌వ్యాప్తంగా జైళ్ల‌లో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు తొలిసారి జైలుకెళ్లిన వారికీ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు శుభ‌వార్త‌ చెప్పింది. వీరిని త్వరిత గతిన విడుడల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరిండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన క్రిమినల్ న్యాయ చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం వీరిని సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

విచారణ ఖైదీలు తమ జైలు శిక్షలో మూడింట ఓ వంతు పూర్తి చేసుకుంటే వీరిని విడుదల చేసేందుకు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత లోని సెక్షన్ 479 ప్రకారం చర్యల్ని వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు జైలు సూపరింటెండెంట్ లకు ఆదేశాలు జారీ చేసింది. జైళ్ల రద్దీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా ఖైదీలకు ఊరట దగ్గబోతోంది.

సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ల సూపరింటెండెంట్‌లను మూడు నెలల్లోగా వీరి దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్‌లకు వర్తించదని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఇప్పుడు జైళ్లలో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వారు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులను ప్రాసెస్ చేసుకునేందుకు వీలు కలిగినట్లయింది.