22 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు…

Date:

తెలంగాణలో రుణమాఫీ చేయకుండా ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా కాలేదని మంత్రులే చెబుతున్నారని, వ్యవసాయశాఖ మంత్రి లెక్క ప్రకారం 22 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పారు. రైతులనే కాదు, రాహుల్‌ గాంధీని కూడా రేవంత్‌ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియాతో సీఎం చేసేది చిట్‌చాట్‌ కాదని.. చీట్‌ చాట్‌ అని విమర్శించారు. లేనివి ఉన్నట్లు చెప్పి మోసం చేయడం రేవంత్‌కు అలవాటేనని మండిపడ్డారు.

”రుణమాఫీ విషయంలో రేవంత్‌ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొండారెడ్డిపల్లి లేదా సిద్దిపేట వెళ్లి రుణమాఫీపై రైతులను అడుగుదాం. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది నా సవాల్‌.. చేశారా? రుణమాఫీ సవాల్‌ ఏమైందో రైతులే చెబుతారు. రుణమాఫీ సభకు రావాలని సీఎం 3 సార్లు ఆహ్వానించినా రాహుల్‌ రాలేదు. ఆయన రాష్ట్రానికి వస్తే రుణమాఫీపై నిలదీస్తాం” అని హరీశ్‌రావు అన్నారు.

Share post:

Popular

More like this
Related

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...

విద్యుత్ అధికారులు లంచం అడిగితే ఫిర్యాదు చెయ్యండి

ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలి. ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం అందుబాటులో ఉండాలి.....

జూనియ‌ర్ వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్ కాదు

పశ్చిమ బెంగాల్ కోల్‌క‌తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన...