హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణాలు భారీగా పెరుగుతున్నాయి. దేశీయంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రయాణాలు భారీగా పెరిగాయి. దీంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి పలు దేశాలకు నేరుగా విమానాలు నడుపుతున్నారు. తాజాగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్టోబర్ 27 ఆదివారం బ్యాంకాక్, థాయ్‌లాండ్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ విమానాలు వారానికి నాలుగు సార్లు నడుస్తాయి. థాయ్ ఎయిర్ ఏషియా ఈ విమానాలు నడుపుతోంది. ఈ విమానం(FD119) హైదరాబాద్ నుంచి రాత్రి 11:25 గంటలకు బయలుదేరి మరుసటి ఉదయం 4:30 గంటలకు బ్యాంకాక్ డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటుంది. రిటర్న్ ఫ్లైట్ (FD118) బ్యాంకాక్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:50 గంటలకు బయలుదేరి రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటుంది. ఈ నాన్‌స్టాప్ విమాన సర్వీస్ ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది.
థాయ్ ఎయిర్‌ఏషియా భాగస్వామ్యంతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించడంపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పనికర్ ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కనెక్టివిటీని పెంపొందించడానికి మా ప్రయత్నాలలో ఈ అభివృద్ధి ఒక ముఖ్యమైన మైలురాయిని పేర్కొన్నారు. ఇది హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య ఆర్థిక,సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుందిని చెప్పారు. ప్రఖ్యాత బడ్జెట్ క్యారియర్ అయిన థాయ్ ఎయిర్ ఏషియా నుంచి వచ్చే సర్వీస్ ప్రయాణికులకు మరింత సరసమైన ధరలు ఉండే అవకాం ఉందని పేర్కొన్నారు.